Saturday, 28 March 2015

Latest Sermon by Pastor Shashi Kiran Pulukuri
on March 22nd 2015
'Spiritual Weaning- Skilled in the Word of Righteousness'
"ఆత్మ సంబంధమైన 'పాలు విడుచుట' - నీతి వాక్యమునందలి అభ్యాసము"
Sunday Service
Genesis - ఆదికాండము 21:8-10. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచిఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రా హాముతో అనెను.
Galatians - గలతీయులకు 4:28. సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.
Hebrews - హెబ్రీయులకు 5:11-14. ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
మనము దేవుని నీతి (మనుష్యుల స్వనీతి కాదు) వాక్య విషయంలో అభ్యాసము లేనివారమైతే ఇంకను పాలు త్రాగు శిశువుతో సమానము. దేవుడు మనకు క్రీస్తు సిలువను బట్టి ఉచితంగా ఇచ్చిన నీతి బహుమానము గూర్చి అభ్యాసము కలిగియుండుటలో తండ్రి సంతోషము దాగియుంది. దాని ఆవశ్యకత ఈ వర్తమానము లో ఉపదేశించబడింది
పూర్తి ఆడియో వర్తమానము కొరకు shalowmcovenantchurch@gmail.com
mail చెయ్యగలరు.
Latest Sermon by Pastor Shashi Kiran Pulukuri
on March 15th 2015 Sunday Service
'క్షయమైన శరీరానికి ఆత్మ కలిగించు ఆరోగ్యం'
'Spirit gives Life to our Mortal Body'
study on Romans 8:11
మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
But if the Spirit of Him that raised up Jesus from the dead dwell in you, He that raised up Christ from the dead shall also quicken your mortal bodies by His Spirit that dwelleth in you.
Latest Sermon by Pastor Shashi Kiran Pulukuri
on March 8th 2015
The '5' that influence powerfully in our life....
Latest Sermon by Pastor Shashi Kiran Pulukuri
on 01st March 2015 Sunday
'ఎబెనేజర్ - సహాయపు రాయి'
మన జీవిత ప్రయాణములో మస్సా (శోధన) మరియు మేరిబా(వివాదము) disputes & temptations అనే ప్రదేశాలగుండా వెళ్తున్నప్పుడు ..
మనకొరకు ఒక బండ కొట్టబడి, చీల్చబడింది. అందులో నుండి మన ప్రతి దాహము తీర్చే జీవజలము సమృద్ధిగా ప్రవహిస్తున్నది. దేవుని పరిశుద్ధతను సన్మానించునట్లు ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఆయనను, ఆయన సన్నిధిని, క్రీస్తునందలి సరఫరాను(supply) నమ్ముకుని ఉందాము.
నిర్గమకాండము 17:1-7 మరియు సంఖ్యాకాండము 20:1-13 (Comparative Study)