"నీ విశ్వాసం నీకు నీతిగా ఎంచబడును"
"...అది అతనికి ఎంచబడెను అని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును నీతిగా ఎంచబడును." (రోమా 4:22-24).
ప్రియ స్నేహితుడా! అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. అనగా అబ్రహాము తనకు వాగ్ధానము చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని తనకు భవిష్యత్తులో నేరవేరుస్తాడని విశ్వసించాడు. ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడింది. వాగ్ధానము భాష్యత్తుకు(Future) సంబధించినది.
మనకైతే దేవుడు తను అత్యధికంగా ప్రేమించే తన అద్వితీయ కుమారున్ని ఇచ్చాడు. తనతో పాటు సమస్తమును మనకిచ్చాడు. ఎట్లనగా మనకు మారుగా యేసును పాపముగా చేసెను (2 కోరింతి 5:21). యేసు శరీరమందు సమస్త పాపమునకు శిక్ష విధించెను (రోమా 8:3). మరణించిన యేసును దేవుడు మృతులలోనుండి లేపాడు. యేసు మరణించక ముందు ఒక వ్యక్తి. పాపముగా చేయబడి సిలువ మీదున్నప్పుడు సమస్త లోక పాపము ఆయన మీద మోపబడింది. మరణించి తిరిగి లేచినపుడు ఒక్కడుగా లేపబడలేదు కానీ సంఘముగా లేపబడ్డాడు.హల్లెలుయ! ఇప్పుడు మనమందరమూ అనగా ఆయన మరణ పునరుత్థానాల యందు విశ్వాసముంచు వారందరూ ఆయన శరీరములోని అవయవములము. హల్లెలుయ! క్రీస్తుయేసు మరణ పునరుత్థానాలు బవిష్యత్తుకు(Future) సంబందించినవి కావు కానీ బూతకాలానికి(Past) సంబందించినవి. ప్రభువైన యేసును మృతులలోనుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును మన విశ్వాసము నీతిగా ఎంచబడును.
నీకు ఏదైనా రోగము నుంచి స్వస్థత కావాలా?
యేసు సిలుమీద పొందిన గాయములచేత స్వస్థత పొందియున్నావు. నీవు అడుగు వాటినన్నిటిని దేవుడు ఎప్పుడో ప్రభువైన యేసుతో పాటు ఇచ్చేసాడు. నీవు 'అడుగునవన్ని' యేసుతో పాటు ఇవ్వబడిన 'సమస్తము'లో ఉన్నాయి. కనుక అడుగు వాటినన్నిటిని క్రీస్తులో పొందియున్నామని విశ్వసించుడి, మీ ఈ విశ్వాసము మీకు నీతిగా యెంచబడును. దేవునికి స్తోత్రము కల్గును గాక! దేవుని కృప మీకు తోడైయుండును గాక!
(ఈ వాక్యాభాగము చేత దేవుడు మీతో మాట్లాడితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవడము మరవద్దు. మేము గాలికి ప్రయాసపడుట లేదు అని మీ అనుభవము చేత మరింత ఉత్సాహ పరచాబడుతాము.)
క్రీస్తునందు
పాస్టర్ శశికిరణ్ పులుకూరి, Shalowm Covenant Church, Nizampet.
ఈ వాక్యాభాగము చేత దేవుడు మీతో మాట్లాడితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవడము మరవద్దు. మేము గాలికి ప్రయాసపడుట లేదు అని మీ అనుభవము చేత మరింత ఉత్సాహ పరచాబడుతాము.
మాతో కూడా ఆరాధించుటకు
ప్రతి ఆదివారము ఉ. 9:00 మరియు సా. 6:00 ఆరాధన

Dhanyavaadamulu
ReplyDelete