దేవుడు క్రీస్తు యేసునందు సిలువమీద చేసి ముగించిన కార్యములను ధ్యానము..
*హెచ్చు* PROMOTION
కీర్తన 113.
"ఇది మొదలుకొని యెహోవా నామము యెల్లకాలము సన్నుతింపబడును గాక"
"ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు."
ఎఫేసి 2:6-7
"క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను."
ఆయన పాదములక్రింద సమస్తమును ఉంచి అనగా 'సమస్తమైన ఆధిపత్యము,సమస్త అధికారములు, సమస్త శక్తులు, సకల ప్రభుత్వములు, అన్ని యుగాలలో పేరు పొందిన పొందబోయే ప్రతి నామము' ఆయన పాదముల క్రింద ఉంచెను. ఎఫేసి1:20.
ద్వితీయోపదేశకాండము 28:1&14
"నీ దేవుడైన యెహోవా నిన్ను భూమిమీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమించడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడావుగా ఉండవు."
కీర్తన 75:6-7
తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును.
దేవుడే స్వయంగా చెప్తున్నాడు నీకు నా ప్రియమైన కుమారున్ని ఇచ్చాను. నీ కోసం ఆయనను సిలువ మరణము వరకు తగ్గించాను ఆయనలో, ఆయనతో నిన్ను హెచ్చించాను. యేసువైపు చూడు... దేవుడు సిలువ మీద నీకోసం చేసి ముగించిన కార్యమును నమ్ము... క్రీస్తు యేసు నందు నీకీయబడిన కృపను స్వీకరించు... నీవన్ని విషయములలో హెచ్చింపబడు....
God Bless U
thank you
Pastor Shashi
http://www.youtube.com/user/shalowmcovenant
https://www.facebook.com/shalowmcovenantchurch
No comments:
Post a Comment