'దేవుని కన్నులు నీతిమంతులను వెదకును'
"తన యెడల యదార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవ కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది." 2 దిన 16 :9
"నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది గదా!" హబక్కూకు 1:13
ప్రియ స్నేహితుడా..! సిలువ మీద మన ప్రభువైన యేసు మన పక్షముగ, మన పాపము వహించిన వాడై నిలిచెను గనుక పరిశుద్ధుడైన తండ్రి చూడనొల్లక యేసును విడచి ముఖమును త్రిప్పకొనెను. అందుకే యేసు "నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విదిచితివి" అని బిగ్గరగా కేకవేసెను.
ఇప్పుడు క్రీస్తు నా మరణము, నా శిక్ష అనుభవించాడు అని విశ్వసించి, విశ్వాసము ద్వారా దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడిన వారిని ఆయన కనుదృష్టి వెతుకుతూ ఉంది. విశ్వాసుల కొరకు, వారిని బలపరచుటకు పరిశుద్ధుడైన దేవుని కనుదృష్టి సంచరిస్తుంది. "ప్రభువు కన్నులు నీతిమంతుల మీద .. ఉన్నవి" 1 పేతురు 3:12. మోషే సైతము చూడలేకపోయిన ("నీవు నా ముఖమును చూడజాలవు" నిర్గమ 33: 20), దేవుని ముఖము ఈ దినమున క్రీస్తును బట్టి మన తట్టు తిప్పబడింది. మనము ఆ ముఖకాంతిని అనుభవిస్తున్నాము. హల్లెలుయ! ఇశ్రాయేలీయుల యాజకులు వారి మీద నేటికి ఉచ్ఛరిస్తున్న (పలుకుతున్న) దీవెన ఆశీర్వాదము...
"....యెహోవ తన ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక!
యెహోవ తన సన్నిధికాంతి నీ మీద ఉధయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక!" సంఖ్య 6:22-26
ఈ ఆశీర్వాదము క్రీస్తు యేసు నందు సంపూర్ణంగా మనకు నేరవేర్చబడింది. ఇంత గొప్ప ధన్యతనిచ్చిన దేవుడు స్తుతిన్చాబాడును గాక! దేవుడు మిమ్మును దీవించును గాక! కృప మీకు తోడైయుండును గాక!
(ఈ వాక్యాభాగము చేత దేవుడు మీతో మాట్లాడితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవడము మరవద్దు. మేము గాలికి ప్రయాసపడుట లేదు అని మీ అనుభవము చేత మరింత ఉత్సాహ పరచాబడుతాము.)
క్రీస్తునందు
పాస్టర్ శశికిరణ్ పులుకూరి,
Shalowm Covenant Church, Nizampet, Hyd.

No comments:
Post a Comment